Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 2:43 pm Posted by : parivarthanaawaaz

14వ వార్డులో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు.. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : శ్రీ సాయి గణేష్ యూత్ ఆధ్వర్యంలో 14వ వార్డులో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్ధంగా బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ యూత్ అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్‌తో పాటు మినుకూరి బాల్ రెడ్డి, చి. రమేష్, బొమ్మరి అనిల్, అరుణ్, సతీష్, బాలకిషన్, రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే కాలనీవాసులు పెద్ద సంఖ్యలో హాజరై సద్దుల బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.