వినాయక నగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
పరివర్తన అవాజ్ కామారెడ్డి:కామారెడ్డి వినాయక నగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళా సోదరీమణులు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పూల బతుకమ్మలతో కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఆటపాటలతో సంతోషంగా గడిపారు.ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ,...