Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 1:41 pm Posted by : parivarthanaawaaz

వినాయక నగర్ కాలనీలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

పరివర్తన అవాజ్ కామారెడ్డి:కామారెడ్డి వినాయక నగర్ కాలనీలో సద్దుల బతుకమ్మ పండుగ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలోని మహిళా సోదరీమణులు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించి, బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలందరూ ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పూల బతుకమ్మలతో కాలనీ అంతా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి, ఆటపాటలతో సంతోషంగా గడిపారు.ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షులు చింతల లింగం మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇలాంటి పండుగలు కాలనీలో ఐకమత్యాన్ని, సోదరభావాన్ని మరింత పెంపొందిస్తాయని తెలిపారు. మహిళలందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 16 వార్డు కౌన్సిలర్ ప్రియాంక సంతోష్ మరియు కాలనీ అధ్యక్షులు చింతల లింగం కోశాధికారి డాక్టర్ సునీల్ కుమార్, దన్నారపు రాజు కె శ్రీనివాస్ తిరుపతిరెడ్డి ప్రవీణ్ కుమార్ రమేష్ కమలాకర్ రెడ్డి డాక్టర్ రవీందర్ అడ్వకేట్ తిరుపతి పొన్నాల శ్రీనివాస్ రెడ్డి లక్ష్మణ్ ఆకుల సంజీవ్ రామకృష్ణ విజయ్ రెడ్డి రంజిత్ రెడ్డి నర్సయ్య గారు తదితరులు పాల్గొన్నారు