Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 4:34 am Posted by : parivarthanaawaaz

హత్యయత్నం ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ఐదు గురుని రిమాండ్ కి తరలించిన రామారెడ్డి పోలీసులు

రామారెడ్డి పరివర్తన ఆవాజ్ : హత్యయత్నం ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ఐదు గురుని రిమాండ్ కి తరలించిన రామారెడ్డి పోలీసులు గిద్దా గ్రామానికి చెందిన గూనోళ్ల మధుసూదన్ తేదీ 30.09.2026 నాడు రాత్రి అందాజు 8 గంటల సమయం లో బండారి బీరయ్య S/o బీరయ్య గారు ఫిర్యాదికి ఫోన్ చేసి బీర్ తాగుదాం అని ఫిర్యాదును రమ్మని చెప్పగా ఫిర్యాది తన బైక్ మీద బీరయ్యను ఎక్కించుకొని తమ గ్రామంలోని ఎల్లమ్మ గుడి దగ్గర గల మామిడి చెట్ల కిందికి వెళ్ళినారు. వీరు వెళ్లేసరికి అక్కడ ఇతని కులస్తులు షాగా రాములు S/o మల్లయ్య, రామోల్ల బీరయ్య S/o బీరయ్య, చింతకింది చిన్న మహిపాల్ S/o మల్లయ్య, చింతకింది మల్లేష్ S/o పెద్దయ్య గార్లు ఉన్నారు. సమయం అందగా రాత్రి 8.20 గంటల సమయంలో ఫిర్యాదిని వీరందరూ పాత కక్షలు మనసులో పెట్టుకుని సాగ రాములు, బండారి బీరయ్య, రామోల్ల బీరయ్య, చింతకింది చిన్న మహిపాల్, చింతకింది మల్లేష్ లు కలిసి ఇతన్ని కట్టేలతో కొట్టి, కత్తితో గొంతు మీద కోసి చంపడానికి ప్రయత్నించినారు అని ఫిర్యాదు రాగా కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్టు చేసి రిమాండ్ కి తరలించనైనది రామారెడ్డి ఎస్సై టి మురళి తెలిపినాడు.