Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 7:11 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లకు సంపూర్ణ మద్దతు –వరంగల్ తూర్పు మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 15

తెలంగాణ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న 17,000 మంది NHM కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్  డిమాండ్ చేశారు.గురువారం పోచం మైదాన్ జంక్షన్ వద్ద వరంగల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో NHM ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపట్టని నిరవధిక నిరసన కార్యక్రమంలో   గ్రేటర్ వరంగల్ తోలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్ పాల్గొని సంఘీభావం తెలియ జేశారు.

అనంతరం నన్నపునేని నరేందర్  మాట్లాడుతు…

NHM ఉద్యోగుల సమస్యలు, న్యాయమైన డిమాండ్లు..రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిరంతరం శ్రమిస్తున్న NHM ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు, వారి సేవలకు తగిన గుర్తింపు, గౌరవం లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి…

—NHM ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు:

– 17,000 మంది NHM ఉద్యోగులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలి.- రెగ్యులరైజేషన్ పూర్తయ్యే వరకు 100% గ్రాస్ శాలరీ చెల్లించాలి.- ఉద్యోగ, ఆరోగ్య భద్రత కల్పించాలి.- 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు అమలు చేయాలి.- 5% వార్షిక ఇంక్రిమెంట్లు, 8% లాయల్టీ బోనస్ అందించాలి.- PRC ప్రయోజనాలు కల్పించాలి…ప్రజారోగ్య వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న NHM ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా, వారి న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలి. ఉద్యోగులకు న్యాయం జరిగే వరకు వారి పోరాటానికి అండగా ఉంటాం.NHM ఉద్యోగులకు న్యాయం చేయాలి – రెగ్యులరైజేషన్ వెంటనే చేపట్టాలి!ఈ కార్యక్రమం లొ NHM JAC స్టేట్ ప్రెసిడెంట్ & ఫౌండర్ డాక్టర్ మహేందర్ రావు , NHM స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ భరత్ కుమార్ , స్టేట్ జనరల్ సెక్రటరీ డాక్టర్ రుకుముద్దీన్ గారు వరంగల్ జిల్లా NHM జేఏసీ నాయకులుఅనిల్, అంజి, నితిన్, డా. రవీందర్, యశస్విని, డా. రమ్య, డా. హరి కృష్ణ, డా. హారిక, జ్యోతి, నర్మద, జ్యోతి, గీత, వైకుంఠం. పాల్గొన్నారు