జమ్మి పూజ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : జయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన జమ్మి పూజ కార్యక్రమంలో కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ, విజయదశమి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతిసౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. జమ్మి పూజ మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇలాంటి పండుగలు ప్రజల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సింహాసనేశ్వరి ఉత్సవ కమిటీ...