SDRF నిధులతో చేపడుతున్న మొరం రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో SDRF నిధులతో చేపడుతున్న మొరం రోడ్డు పనులను మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను...