Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 7:49 am Posted by : parivarthanaawaaz

SDRF నిధులతో చేపడుతున్న మొరం రోడ్డు పనులను పరిశీలించిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 9వ వార్డులో SDRF నిధులతో చేపడుతున్న మొరం రోడ్డు పనులను మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఎక్కడా నాణ్యత లోపించకుండా, నిబంధనలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని, అభివృద్ధి పనుల విషయంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చైర్‌పర్సన్ సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పర్వతాలు,స్థానిక కౌన్సిలర్ నరేందర్ రెడ్డి, DE హన్మాంతరావు, Ae వేణు ప్రసాద్ ,TPOS వినీత్, దేవరాజు ,స్థానిక ప్రజలు ,మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..