Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 2:43 pm Posted by : parivarthanaawaaz

ముదిరాజులను బీసీఏలో కలపడంపై గంగపుత్రుల మహాధర్నా

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి  :  బిసిడిలో ఉన్న ముదిరాజు కులస్తులను బీసీఏలో కలపడాన్నీ నిరసిస్తూ ప్రభుత్వ మొండి వైఖరి ఖండిస్తూ గంగపుత్రులందరూ ముక్తకంఠంతో కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు పట్టణ గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర గంగపుత్ర సమితి చైర్మన్ డాక్టర్ రమేష్ బాబు, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం జిల్లా అధ్యక్షులు కోరుపాల మహేందర్, విజయ్ కుమార్ మాట్లాడారు బీసీడీలో ఉన్న కులస్తులను బీసీఏలో కలపడాన్నీ నిరసిస్తూ ప్రభుత్వ మొండి వైఖరి మార్చుకోవాలని, లేకపోతే వచ్చే ఎలక్షన్లలో సీఎం రేవంత్ రెడ్డికి గంగపుత్ర సంఘం ఆధ్వర్యంలో తగిన గుణపాఠం చెప్తామని డిమాండ్ చేశారు. ఈ మహా ధర్నాలో ప్రధాన కార్యదర్శురి కోరుపాక సురేష్, ఉపాధ్యక్షులు పాక నారాయణ, కసాపురం ఎల్లయ్య , లక్ష్మినారాయణ ,దువ్వల సత్య ప్రకాష్, రవికిరణ్, లక్మన్ గంగపుత్ర సంఘం సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.