పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి
పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బహుజన వీరుడు,తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి పాల్గొని పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పండుగ సాయన్న జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం 38 సంవత్సరాల కాలం మాత్రమే జీవించి పేద ఆడపిల్లల...