Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 22 October 2026, 7:21 am Posted by : parivarthanaawaaz

పండుగ సాయన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ ఇప్ప ఉమారాణి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో బహుజన వీరుడు,తెలంగాణ రాబిన్ హుడ్ పండుగ సాయన్న జయంతి అధికారిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ విక్టర్ తో కలిసి పాల్గొని పండుగ సాయన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్బంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ పండుగ సాయన్న జయంతి ని అధికారికంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేవలం 38 సంవత్సరాల కాలం మాత్రమే జీవించి పేద ఆడపిల్లల కు కులమతాలకు అతీతంగా వివాహాలు జరిపించి వారి కుటుంబాల్లో పెద్ద కుమారుడి లా వెలుగులు నింపారు.కులం,మతం అనే తేడా లేకుండా బహుజన రాజ్యాధికారమే ధ్యేయంగా పోరాటం చేసిన వీరుడు సాయన్న అని వారి ఆశయాలను కొనసాగించినప్పుడే మనం వారికీచ్చే ఘనమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇప్ప శ్రీనివాస్, పున్న రాజేశ్వర్,నీల నాగరాజు,కాళ్ళ గంగరాజు, గజ్జెల బిక్షపతి,నంద రమేష్,బట్టు విఠల్, అరవింద్,భాను ప్రకాష్,కాళ్ళ గణేష్, శివరాములు,మల్లన్న, ఎల్లయ్య,నరేందర్,చక్రధర్,పవన్ తదితరులు పాల్గొన్నారు.