మచారెడ్డి పోలీసుల తీరుపై మానవ హక్కుల కమిషన్ సీరియస్.. కేసు నమోదు
ఫరీద్పేట మహిళా వార్డు సభ్యుల ఫిర్యాదుపై ఎస్ హెచ్ఆర్సీ కొరడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించిన మానవ హక్కుల కమిషన్ (కేసు నెం. 3947/36/18/2026 కామారెడ్డి జిల్లా పరివర్తన ఆవాజ్ : కామారెడ్డి జిల్లా, పల్వంచ మండలం ఫరీద్పేట గ్రామంలో అక్రమ బెల్టు షాపులను, నిధుల దుర్వినియోగాన్ని ప్రశ్నించిన మహిళా వార్డు సభ్యురాలపై దౌర్జన్యం చేసి, ప్రాణహాని బెదిరింపులకు పాల్పడిన నిందితులపై చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన మచారెడ్డి పోలీసుల వ్యవహారశైలిపై మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. గ్రామానికి చెందిన 1వ వార్డు...