Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 03 October 2026, 11:30 am Posted by : parivarthanaawaaz

కామారెడ్డిలో ఘనంగా గురు పాదుకల శోభాయాత్ర

          ఆత్మానాత్మ నిరసనానంద మలకపల్లి సాంబశివ కుమార్ నిర్వాహకులు

 కామారెడ్డి పరివర్తన ఆవాజ్ :కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపంలో గురు పాదుకల శోభాయాత్ర, ఆధ్యాత్మిక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గురువుల ఆశీస్సులు పొందారు. ఉపనిషత్తుల ఆధారంగా జన్మరహిత సిద్ధాంతాన్ని బోధిస్తూ నిర్వహించిన ఆధ్యాత్మిక శిక్షణ తరగతులు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కామారెడ్డి పట్టణంలోని శ్రీ వాసవి కళ్యాణ మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కామారెడ్డి సాంప్రదాయక భక్త మండలి, శ్రీశ్రీశ్రీ సీతారామచంద్ర పరిపూర్ణ బోధోపదేశ మందిరం సంస్థల ఆధ్వర్యంలో గురు పాదుకల శోభాయాత్ర, పూజా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక శిక్షణ తరగతులను ఘనంగా నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగిన ఈ కార్యక్రమంలో ముఖ్య బోధాధికారులు పాల్గొని భక్తులకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించారు. శివరామ దీక్షిత సంప్రదాయ సిద్ధాంతం, శ్రీమహావిష్ణు సంప్రదాయంలోని ఉపనిషత్ ప్రమాణమైన జన్మరహిత సిద్ధాంతంపై విశేష బోధనలు చేశారు. పండితులు, పామరులు అనే భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించగలిగే ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రజలకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. జన్మరాహిత్య సిద్ధాంతం ద్వారా మానవాళికి ఆధ్యాత్మిక విముక్తి మార్గాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య భక్తులు సత్య శివప్రసాద్, ఆత్మానాత్మ నిరసనానంద మలకపల్లి సాంబశివ కుమార్, ఇలపకుర్తి పద్మజతో పాటు స్థానిక గురువులు కస్వ చంద్రశేఖర్, పార్శి జ్యోతి, నాగలక్ష్మీ దంపతులు, బోండ్ల శంకర్ తదితరులు సహకారం అందించారు. స్థానికంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణకు విశేష కృషి చేసిన విధేయానంద ఆరుగొండ విశ్వనాథంను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గోన్నారు.