Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 3:08 pm Posted by : parivarthanaawaaz

మాదిగల అభివృద్ధికి ప్రభుత్వ హామీలు అమలు చేయాలి: సీనియర్ ఎమ్మార్పీఎస్ డిమాండ్

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలోని మా గార్డెన్ ఫంక్షన్ హాల్లో మాదిగల అభివృద్ధి మా లక్ష్యం సీనియర్ ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు చిట్యాల సాయన్న అధ్యక్షున సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీనియర్ ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అల్లారం రత్నయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు రామచందర్ భలేరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సంజీవరావు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర రాంచంధర్, రాష్ట్ర కార్యదర్శి రాములు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్ ఎమ్మార్పీఎస్ కామారెడ్డి జిల్లా మాదిగల అభివృద్ధి మా లక్ష్యం అనే సమావేశం నిర్వహించడం జరిగిందని. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మార్పీఎస్ వర్గీకరణకు సీఎం రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే గౌరవిస్తూ ఎమ్మార్పీఎస్ వర్గీకరణ చేయడం జరిగిందని, అదేవిధంగా అంబేద్కర్ అభయ హస్తం క్రింద 12 లక్షల రూపాయలు ఇవ్వాలని కోరారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన ప్రభుత్వ భూములకు అన్ని హక్కులు కల్పిస్తూ సౌకర్యం కల్పించాలని కోరుతున్నామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మార్పీఎస్ వర్గీకరణ వెంటనే ఎలాగైతే అమలు చేశాడో వీటిని కూడా వెంటనే అమలు చేయాలని కోరడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.