Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:07 am Posted by : parivarthanaawaaz

దసరా ఉత్సవాలను విజయవంతం చేయాలి.

.ఇప్ప ఉమారాణి శ్రీనివాస్  మున్సిపల్ చైర్ పర్సన్..

పరివర్తన అవాజ్ కామారెడ్డి :జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ స్టేడియంలో షబ్బీర్ ఫౌండేషన్ మరియు దసరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దసరా ఉత్సవాలను కులమతాలకు,రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పేర్కొన్నారు. విజయదశమి అంటేనే చెడు పై మంచి విజయం సాధించడం,అలాగే ప్రజలందరూ శాంతియుతంగా కలిసిమెలిసి ఐక్యంగా ఉన్నప్పుడే సమసమాజం శాంతిభద్రతలతో,ధర్మ పరిరక్షణలో,అభివృద్ధి పథంతో ముందుకెళ్తామని ఆకాంక్షించారు. ఉత్సవాలకు బారీ సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం వుంటది కావున ప్రభుత్వ సలహాధారు షబ్బీర్ అలీ సూచనల మేరకు తాగునీటి సదుపాయం,భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ద వహిస్తూ ఉత్సవం విజయవంతం కోసం అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నామని తెలిపారు.లేజర్ షో,పెద్ద ఎత్తున క్రాకర్స్ తో కార్యక్రమం ఉంటుంది కావున ఈ ఉత్సవాలను తిలకించడానికి కుటుంబసమేతంగా విచ్చేసి కార్యక్రమాన్ని తిలకించాలని,అదేవిధంగా ట్రాఫిక్ దృష్ట్యా పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు. ఈ విజయదశమి అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని,అందరి సహకారంతో పట్టణం అభివృద్ధి పథంలో ముందుకెళ్లాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.