Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 15 October 2026, 4:08 pm Posted by : parivarthanaawaaz

దోమకొండ మండల మహిళా సమైక్య కార్యాలయంలో వ్యక్తిగత రుణాలపై అవగాహన

పరివర్తన ఆవాజ్ అక్టోబర్ 15 కామారెడ్డి దోమకొండ : మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల కుటుంబాలను ఆర్థికంగా బలవపేతం చేయడంతో పాటు, ఇప్పటికే కొనసాగిస్తున్న వ్యాపారాలను మరింత విస్తరించేందుకు వ్యక్తిగత రుణాలు కీలకమని డి పి ఎం రాజయ్య అన్నారు. ఈ దిశగా అర్హులైన లబ్ధిదారులకు వ్యక్తిగత రుణాలు అందించేందుకు అవసరమైన దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. దోమకొండ మండల సమైక్య కార్యాలయంలో గురువారం వ్యక్తిగత రుణాల దరఖాస్తుల ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 29 గ్రామ సంఘాలకు చెందిన వి వో ఏ లు, సీసీలు, ఏపిఎం, అకౌంటెంట్, కెనెరా బ్యాంకు సిబ్బంది,మండల సమైక్య పాలకవర్గ సభ్యులు, మహిళ సంఘ సభ్యులు హాజరయ్యారు. వ్యక్తిగత రుణాల దరఖాస్తుల నమోదు, ఆన్లైన్ ప్రక్రియ బ్యాంకులకు దరఖాస్తులు అందజేయడం వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు.