Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 20 October 2026, 12:28 pm Posted by : parivarthanaawaaz

రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షెబ్బీర్ అలీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి

పరివర్తన ఆవాజ్ కామారెడ్డి : విజయదశమి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ మంత్రి మహమ్మద్ షెబ్బీర్ అలీ  కామారెడ్డి మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విజయదశమి పండుగ ప్రజలందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలను నింపాలని, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్నమి రాజేశ్వర్ , సుధీర్ రెడ్డి, శ్రావణ్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.