Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 6:07 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

స్వర్గీయ వేం సతీష్ రెడ్డి కి నివాళులర్పించిన: ఎంపీ రవిచంద్ర….

వరంగల్  పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 10

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పెద్దన్న కిషన్ తదితరులతో కలిసి స్వర్గీయ వేం సతీష్ రెడ్డికి
నివాళులర్పించారు. మహబూబాబాద్ జిల్లా తీగాలవేణి వాస్తవ్యులు మిత్రుడు సతీష్ రెడ్డి గుండెపోటుతో మరణించగా ఈ విషయం తెలిసిన వెంటనే హనుమకొండ లోని వారి నివాసానికి చేరుకొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియపరచి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించినారు అనంతరం జరిగిన అంతిమయాత్రలో పాల్గొన్నారు,ఈ కార్యక్రమంలో రవిచంద్ర తన పెద్దన్న కిషన్,వేం రామచంద్రారెడ్డి,యాకుబ్ రెడ్డి,శ్రీనివాస్ రెడ్డి, రంగారావు .ఇనుగుర్తి గ్రామ సర్పంచ్ కుమార్,ఉప సర్పంచ్ సత్తూరి యాదగిరి, సింగిల్ విండో ఛైర్మన్ ధీకొండ వెంకన్న గౌడ్, మాజీ సర్పంచ్ దార్ల రాంమూర్తి మరియు ఇనుగుర్తి, తీగలవేణి గ్రామస్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులు అర్పించారు