సద్దుల బతుకమ్మ వేడుకల్లో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడిన మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్….

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18  వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పలు ప్రాంతాల్లో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో గ్రేటర్ వరంగల్ తొలి మేయర్, వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు  నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ వారికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా నన్నపునేని నరేందర్  మాట్లాడుతూ.... తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవడం సంతోషకరమని తెలంగాణ...