Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 02 October 2026, 3:25 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

 –సత్యం, అహింస నినాదంతో స్వదేశం కోసం పొరాడిన గొప్ప దార్శనికుడు మహాత్మ గాంధీ– -మాజీ మంత్రి వరంగల్  తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 02

గాంధీ జయంతి సంధర్భంగా వరంగల్ పోస్ట్ ఆఫీస్ స్టేషన్ రోడ్డు లో గల మహాత్మగాంధీ విగ్రహనికి మాజీ  మంత్రివర్యులు వరంగల్  తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ  పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొండా సురేఖ  మాట్లాడుతూ గాంధీ  సిధ్ధాంతాలను దృష్టిలో ఉంచుకొని నవ భారత నిర్మాణానికి మనమందరం పనిచేయాలి తెపిపారు.మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, సామరస్యాన్ని ఆయుధాలుగా చేసుకుని దేశ స్వాతంత్ర్య ఉద్యమానికి నాయకత్వం వహించారని,గాంధీజీ చూపిన సత్యం, అహింస మార్గాలు నేటి సమాజానికి కూడా ఎంతో ఆదర్శప్రాయమని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు.గాంధీజీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రతి ఒక్కరూ జీవితంలో ఆచరించాలని, సమాజంలో శాంతి, సోదరభావం, సామాజిక సమానత్వాన్ని పెంపొందించేందుకు కృషి చేయాలని మాజీ మంత్రి సురేఖ  పిలుపునిచ్చారు.గాంధీజీ  ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని మాజీ మంత్రి సురేఖ  అన్నారు.