Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 18 October 2026, 4:21 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

శ్రీ శారదా అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య….

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 18

వరంగల్‌లోని శ్రీ శృంగేరి శారదాపీఠంలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు ఆదివారం దుర్గాష్టమి సందర్భంగా లలితా త్రిపుర సుందరి అలంకారంలో కొలువుదీరిన శ్రీ శారదా అమ్మవారిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి , శాసన మండలి సభ్యులు  బస్వరాజు సారయ్య దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ సందర్భంగా వారు ప్రార్థించారు.ఎమ్మెల్యే వారివెంట స్థానిక నాయకులు,భక్తులు, కార్యకర్తలు ఉన్నారు.