—శాఖలకు సంబంధించిన సమగ్ర సమాచారం లేకుండా ఎందుకు వచ్చారు–అధికారుల తీరుపై వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య ఆగ్రహం…
పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1 అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై సమగ్ర సమాచారంతో దిశా సమావేశానికి హాజరుకావాల్సిన అధికారులు పూర్తి వివరాలు లేకుండా రావడంపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. దిశా కమిటీ సమావేశానికి జిల్లా స్థాయి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని, వచ్చే సమావేశానికి తమ శాఖలకు సంబంధించిన పూర్తి సమాచారంతో రావాలని స్పష్టం చేశారు.హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అధ్యక్షతన జిల్లా అభివృద్ధి...