Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 2:29 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–వెట్టిచాకిరీ నిర్మూలనపై విస్తృత అవగాహన కల్పించాలి..

–-స్వేచ్ఛా రథంను జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 26

వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే రిటైర్డ్ ఐపీఎస్ కె.ఆర్నాగరాజు పేర్కొన్నారు.వెట్టిచాకిరీకి గురైన కార్మికులను గుర్తించడం, వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, బాధితులకు అవసరమైన సహాయాన్ని అందించడంలో సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రాష్ట్రవ్యాప్త అవగాహన ప్రచార కార్యక్రమంలో భాగంగా, సోమవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ లో ‘స్వేచ్ఛా రథం’ ప్రచార వాహనాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద,మేర కార్పొరేషన్ చైర్మెన్ వెంకట్రాజం,గ్రంథాల చైర్మన్ మీసాల ప్రకాశ్  చే మీ పని,మీ జీవితం,మీ స్వేచ్ఛ అనే గోడపత్రికను ఆవిష్కరించి , వెట్టి చాకిరి పై అవేర్నెస్ కల్పించేందుకు ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా వర్ధన్న పేట ఎమ్మెల్యే రిటైర్డ్ ఐపీఎస్ కె.ఆర్.నాగరాజు  మాట్లాడుతూ….వెట్టిచాకిరీపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి అన్నారు.ఘటనలను గుర్తించడంలో ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, బాధితులను సకాలంలో గుర్తించి రక్షణ, పునరావాసం, అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.కార్మికులు తమ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, ఎక్కడైనా వెట్టిచాకిరీ జరుగుతున్నట్లు గుర్తిస్తే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు.వ్యవసాయం, ఇటుక బట్టీలు, ఆక్వాకల్చర్, గనులు, క్వారీలతో పాటు ఇతర అసంఘటిత కార్మిక రంగాల్లో వెట్టిచాకిరీ చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని వారిని అరికట్టుటకు అవగాహన కల్పించాలని తెలిపారు.అడ్వాన్స్‌లు, అప్పులు, వేతనాలు నిలిపివేయడం, బెదిరింపులు, బలవంతం, మోసం వంటి పద్ధతుల ద్వారా కార్మికులను పనిలో బంధించే పరిస్థితులు ఏర్పడవచ్చని, అలాంటి పరిస్థితులను గమనించి లేబర్స్ కు న్యాయం చేయాలని పేర్కొన్నారు.కొన్నిసార్లు బాధితులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించలేకపోవడం, హక్కులపై అవగాహన లేకపోవడం, యజమానుల నుంచి ప్రతీకార చర్యలు ఎదురవుతాయనే భయంతో ఫిర్యాదు చేయకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు వెలుగులోకి రావడం లేనిదని, ఇట్టి వెట్టి చాకిరి పనుల వర్కర్స్ కు అవేర్నెస్ కల్పించాలని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…వెట్టిచాకిరీ నిర్మూలనపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, బాధితులు ఫిర్యాదు చేసేందుకు అందుబాటులో ఉన్న బాండెడ్ లేబర్ టోల్‌ఫ్రీ హెల్ప్‌లైన్ 080-69434343 గురించి విస్తృతంగా ప్రచారం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం మన్నారు.వెట్టిచాకిరీ అనేది కార్మికుల స్వేచ్ఛను హరించి, వారి హక్కులను కాలరాసే తీవ్రమైన దోపిడీ అని పేర్కొన్నారు.స్వేచ్ఛా రథం వరంగల్* జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు, ముఖ్యంగా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న కార్మికులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు.వెట్టిచాకిరీని ఎలా గుర్తించాలి, ఎక్కడ ఫిర్యాదు చేయాలి, బాధితులకు ఎలాంటి ప్రభుత్వ సహాయం అందుబాటులో ఉంది అనే అంశాలను ప్రచార రథం ద్వారా వివరించనున్నారని పేర్కొన్నారు.వెట్టిచాకిరీ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, కార్మికులు, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో కృషి చేయాలని అధికారులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, వరంగల్ భార్గవ్ ప్రభుత్వ అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.వెట్టిచాకిరీకి గురైన వ్యక్తులను గుర్తించడం, వారిని రక్షించడం, పునరావాసం కల్పించడం, బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేయడం తమ బాధ్యతగా నిర్వర్తిస్తామని అధికారులు ప్రతిజ్ఞ చేశారు.ఈ ప్రచార కార్యక్రమంలో కార్మిక శాఖ, పోలీసు శాఖ, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), జిల్లా న్యాయ సేవల సంస్థ (DLSA), మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖ తదితర సంబంధిత శాఖల అధికారులు భాగస్వాములయ్యారు. సమాచార, పౌర సంబంధాల శాఖ (DIPR), మీడియా అకాడమీ సహకారంతో కూడా ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నమమని లేబర్ ఆఫీసర్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎల్ కిషోర్ కుమార్,సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.