Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 01 October 2026, 2:13 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-వృద్ధులను వేధిస్తే కఠిన చర్యలు…తల్లిదండ్రుల బాద్యత పిల్లలదే పూజిత.. —డి. ఎల్. ఎస్. ఎ సెక్రటరీ, డాక్టర్ అనితా రెడ్డి, సీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్…

–పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 1

ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం పురస్కరించుకుని డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అధారిటీ ఆధ్వర్యంలో వృద్ధుల పోషణ, రక్షణ చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా
కే. యు పక్కన గల వృద్ధ ఆశ్రమాన్ని, డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అధారిటీ సెక్రటరీ నేరెళ్ళ వెంకట హైమ పూజిత మరియుసీనియర్ సిటిజన్స్ ట్రిబ్యునల్ కోర్టు మెంబర్, అనురాగ్ సొసైటీ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి సందర్శించారు వృద్ధులను ఆత్మీయంగా పలకరించారు అనంతరం , వృద్ధుల చట్టం మరియు ట్రిబ్యునల్ కోర్టు పై అవగాహన కార్యక్రమం నిర్వహించగా జడ్జి నేరెళ్ళ వెంకట హైమ పూజిత మరియు డాక్టర్ అనితా రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు డాక్టర్ అనితా రెడ్డి అద్యక్షత వహించారు ఈ సందర్భంగా జడ్జి నేరెళ్ళ వెంకట హైమ పూజిత, డాక్టర్ అనితా రెడ్డి మాట్లాడుతూ తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదేనని వయో వృద్దులకు వరం ట్రిబ్యునల్ బెంచ్ అని వయోవృద్దులకు ఏ సమస్యలు లేదా వేధింపులకు గురైనా డిస్ట్రిక్ట్ లీగల్ సర్విస్ అధారిటీ లేదా ట్రిబ్యునల్ బెంచ్ ని సంప్రదించాలని వృద్ధాప్యము ఎవరికి శాపంగా మారకూడదని అన్నారు వయో వృద్దులను వేదిస్తే కటిన చర్యలు తీసుకోబడతాయని అన్నారు , బ్రతికి ఉండగా పిల్లలకు పూర్తిగా ఆస్తులన్నీ పంచకూడదని తమ అవసరాలకు ఉంచు కోవాలని తదనంతరం చెందేలా విల్లు రాయాలని అన్నారు తల్లిదండ్రుల బాద్యత వద్దు అనుకున్న పిల్లలకు ఆస్తిని, అధికారాలను అడిగే హక్కు లేదని అన్నారు, వృద్ధులను గౌరవించడం, ప్రేమించడం మన సంస్కారానికి నిదర్శనం అన్నారు, తల్లి దండృులను ప్రేమించని వారు, ఇబ్బంది పెట్టే వారు ఎంతటి కోటీశ్వరులైన దరిద్రులతో సమానం అని అన్నారు ఏదిఏమైనా తల్లిదండ్రుల బాధ్యత పిల్లలదేనని మరువ కూడదని అన్నారు, అనంతరం వృద్ధుల కు పండ్లు పంపిణీ చేశారు, ఈ కార్యక్రమంలో జడ్జి పూజిత, డాక్టర్ అనితా రెడ్డి, రవి, సంస్థ నిర్వాహకులు నాగరాని నరేష్, శ్రీకాంత్ మమత వృద్ధులు తదితరులు పాల్గొన్నారు