—వాల్మీకి మహర్షి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25 వాల్మీకి మహర్షి జయంతి సందర్భంగా వరంగల్‌ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామాయణ మహాకావ్యాన్ని రచించి భారతీయ సంస్కృతి, నైతిక విలువలు, ధర్మ మార్గాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహర్షి వాల్మీకి జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే  పేర్కొన్నారు. సమాజంలో మానవత్వం, సమానత్వం, సోదరభావం, నైతిక విలువలను పెంపొందించడంలో...