Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 5:57 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

వర్ధన్నపేట కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద..

వరంగల్, అక్టోబర్ 4 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక….జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం వర్ధన్నపేట లోని ఇల్లంద కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు అందుతున్న విద్య, వసతి, భోజనం, పారిశుధ్యం తదితర సౌకర్యాలను పరిశీలించారు.విద్యార్థులతో మాట్లాడి వారి చదువు, వసతి సౌకర్యాలు, భోజనం, పాఠశాలలో సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, పౌష్టికాహారం, పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలని సంబధిత అధికారులను ఆదేశించారు.విద్యార్థుల హాజరు, విద్యా ప్రమాణాలు, వసతి గృహాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు.కేజీబీవిలో ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ లో వేసిన కంప్లైంట్స్ జిల్లా కలెక్టర్ పరిశీలించారు.ఈ ఆకస్మిక తనిఖీలో జిల్లా బి సి వెల్ఫేర్ అధికారి పుష్ప లత, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.