Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 5:12 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-వర్ధన్నపేటలో దుర్గాభవాని పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు…..

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17

వర్ధన్నపేటలో నిర్వహించిన శ్రీ దుర్గాభవాని పూజ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే కి సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వచనాలు అందజేశారు. అమ్మవారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్ శిబారాణి రాజేందర్, పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, కౌన్సిలర్లు పాపారావు, నాయకులు సుధీర్, సురేష్, రామచందర్ రెడ్డి, రాకేష్, బాబూలాల్, రాజితరెడ్డి, రాకేష్,పట్టణ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.