–వరద ముంపునకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.. —57వ డివిజన్‌లో రూ.2.52 కోట్లతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన..నాయిని రాజేందర్ రెడ్డి…

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్, అక్టోబర్ 6 వరంగల్ పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా 57వ డివిజన్‌లోని సమ్మయ్యనగర్, గోకుల్‌నగర్ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు  నాయిని రాజేందర్ రెడ్డి  తెలిపారు. డివిజన్‌లో సుమారు రూ.2.52 కోట్ల నిధులతో అంతర్గత రోడ్లు, సైడ్ డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే ప్రారంభించి,...