–వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ఎన్‌ఐటీ సాంకేతిక సహకారం… –జీడబ్ల్యూఎంసీ–ఎన్‌ఐటీ వరంగల్ మధ్య కీలక ఒప్పందం..

జిడబ్ల్యూఎంసీ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28 వరంగల్ నగరాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, మెరుగైన మౌలిక సదుపాయాలతో, సుస్థిర పట్టణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) వరంగల్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. హనుమకొండ జిల్లా కలెక్టర్, జీడబ్ల్యూఎంసీ ప్రత్యేక అధికారి చాహత్ బాజ్‌పాయ్ సమక్షంలో బుధవారం ఎన్‌ఐటీ వరంగల్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న, ఎన్‌ఐటీ వరంగల్ డైరెక్టర్ ప్రొఫెసర్ బిద్యాధర్...