Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 04 October 2026, 1:32 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

వంచనగిరిలో మృతుల కుటుంబాలకు వరంగల్ ఎమ్మెల్యే    కొండా సురేఖ పరామర్శ — అండగా ఉంటామని భరోసా

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 04

వంచనగిరి గ్రామంలో మృతి చెందిన బొల్లం కొమురెల్లి  పార్థివదేహానికి మాజీ మంత్రి తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ  నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.అదేవిధంగా అనారోగ్యంతో మృతి చెందిన కొండా కొమురమ్మ  కుటుంబాన్ని కూడా కొండా సురేఖ  పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, ఈ కష్ట సమయంలో కొండా కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని వరంగల్ ఎమ్మెల్యే కొండా సురేఖ  తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.