Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 26 October 2026, 2:31 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మాచర్ల బిక్షపతిని పరామర్శించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 25

హాసన్‌పర్తి మండలం నాగారం గ్రామానికి చెందిన మాచర్ల బిక్షపతి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై హనుమకొండలోని బందన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు  ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఈ సందర్భంగా బిక్షపతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.వారి వెంట హాసన్ పర్తి మండల అధ్యక్షులు అశోక్, నాగారం గ్రామ సర్పంచ్ సంతోష్,ఆత్మకూరు మార్కెట్ వైస్ చైర్మెన్ తిరుపతి, తదితరులు పాల్గొన్నారు.