పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 04
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 57 డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రెండ్ల శ్రీనివాస్ తండ్రి రెండ్ల వెంకటయ్య దశదిన కర్మ కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా వెంకటయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి , వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట జిల్లా కాంగ్రెస్ మహిళ అధ్యక్షురాలు బంక సరళ సంపత్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు అశోక్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.