పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 ప్రజాస్వామ్య పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం నినాదాలు చేస్తూ నాయకులు, ప్రజాప్రతినిధులు, వరంగల్ చౌరస్తా నుంచి పోచం మైదాన్ జంక్షన్ వరకు మాజీ కార్పొరేటర్లు, కాంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాదయాత్రలో పాల్గొన్నారు.పాదయాత్ర అనంతరం పోచం మైదాన్ జంక్షన్ లో రాణి రుద్రమదేవి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదని, ప్రతి ఓటు ప్రజల హక్కుకు ప్రతీక అని అన్నారు. ఎన్నికల వ్యవస్థపై ప్రజల్లో నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉందని మాజీమంత్రి సురేఖ అన్నారు.ఓటు చోరీ, ఎన్నికల అక్రమాలకు సంబంధించిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, వాస్తవాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వ్యవహారశైలిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కొండా సురేఖ డిమాండ్ చేశారు.ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతుందని, ఓటు హక్కును కాపాడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని సురేఖ స్పష్టం చేశారు.అలాగే కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అరెస్టు కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి పరాకాష్ట అని నాయకులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రశ్నించే గొంతులను అణచివేయడం సరికాదని, కేంద్ర ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని డిమాండ్ చేశారు.పరిరక్షణ, ఓటు హక్కు రక్షణ కోసం రాజకీయాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యంగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా పనిచేయాలని మాజీ మంత్రి సురేఖ పేర్కొన్నారు