–రాహుల్ గాంధీ అరెస్టుపై కాంగ్రెస్ శ్రేణుల ఆగ్రహం… —సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను అరెస్ట్ చేయాలి: ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు….

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 7 కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నాయకులు  రాహుల్ గాంధీ  ని అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ హనుమకొండలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనుగాల వెంకట్రామిరెడ్డి  ఆధ్వర్యంలో హనుమకొండ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే  నాయిని రాజేందర్ రెడ్డి  తో కలిసి వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి ...