రాజకీయ స్వార్థం కోసం కాకుండా ప్రజలకు సేవ చేసే నాయకులకే పట్టం కట్టాలి: ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17 హనుమకొండ: పార్టీలు, రాజకీయాలకు అతీతంగా అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో పనిచేసే నాయకులను ప్రజలు ఆదరించాలని, రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఆలోచించకూడదని ఆయన పిలుపునిచ్చారు.శనివారం హనుమకొండలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అర్హత పొందిన 210 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ...