—రహదారుల పరిశుభ్రత, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి… —అధికారులను ఆదేశించిన కలెక్టర్, GWMC ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 హనుమకొండ  నగరంలో రహదారుల వెంట ఉన్న ఆక్రమణలను తక్షణమే తొలగించి, ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్, GWMC ప్రత్యేకాధికారి చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు.గురువారం GWMC ప్రత్యేకాధికారి, హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్, GWMC కమిషనర్ టి. వెంకన్నతో కలిసి నగరంలోని కల్లుమండువా జంక్షన్, చింతగట్టు, రామారం, కాకతీయ యూనివర్సిటీ రెండవ గేట్, ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారుల పరిస్థితి, ట్రాఫిక్, ఆక్రమణలు, పారిశుద్ధ్య...