రంగాళీల మైదానంలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు….ప్రశాంతంగా ముగిసిన బతుకమ్మ వేడుకలు….
--బతుకమ్మ వేడుకలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.... ---ఆడబిడ్డలు పుట్టింటికి వచ్చే అతిపెద్ద పండుగ బతుకమ్మ – జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.... వరంగల్, అక్టోబర్ 18 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక వరంగల్లోని రంగళీల మైదానంలో సద్దుల బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.మహిళలతో కలిసి బతుకమ్మ ఆటలు ఆడుతూ పండుగ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, వర్షాకాలం ముగిసి శరదృతువు ప్రారంభమయ్యే...