Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:32 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

–మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి… –ఆరోగ్యవంతమైన యువతతోనే వికసిత్ భారత్–2047 సాధ్యం: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద…

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28:

భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ, వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సత్య శారద ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, చదువుపై దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన పై సందేశం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వక్తృత్వ, వ్యాసరచన పోటీల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మెన్ బేతి అశోక్ బాబు, వైస్ చైర్మన్ శనబోయిన రాజ్‌కుమార్, సలహాదారులు ఈవీ శ్రీనివాసరావు, కోశాధికారి బొల్లం శివ, రాష్ట్ర మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు నడెం శాంతికుమార్, మేనేజింగ్ కమిటీ మెంబర్స్ మండల పరశురాములు, తోట సంపత్ కుమార్, మామిడాల రమేష్ బాబు, డాక్టర్ రాజ్‌కుమార్, తిరుపతిరెడ్డి, ముల్క ప్రసాద్, కళాశాల డైరెక్టర్లు సీహెచ్ వాణి, విశ్వాంబర్ రెడ్డి, అధ్యాపకులు, ఎండీ అజం, రియాజ్ తదితరులతో పాటు విద్యార్థిని విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.అనంతరం విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని విద్యార్థిని విద్యార్థులు ప్రతిజ్ఞ చేశారు.