Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 29 October 2026, 4:33 am Posted by : MOHAMMED BASHEERUDDIN..

—మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి! ఆరోగ్యవంతమైన యువతతోనే వికసిత్ భారత్–2047 సాధ్యం….

—వక్తృత్వ, వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులు అందజేసిన కలెక్టర్ సత్య శారద, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు…

వరంగల్ జిల్లా ప్రతినిధి పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 28

విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, చదువుపై దృష్టి సారించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ సత్య శారద పిలుపునిచ్చారు.నషా ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా భారతీయ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బొల్లికుంట వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా యువతకు మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై సందేశమిచ్చారు.అనంతరం వక్తృత్వ, వ్యాసరచన పోటీల విజేతలకు కలెక్టర్ సత్య శారద, రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు బహుమతులు అందజేశారు. కార్యక్రమం ముగింపులో విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని, వాటి దుష్ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మత్తు పదార్థాల రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు, వైస్ చైర్మన్ శనబోయిన రాజ్‌కుమార్, సలహాదారులు ఈవీ శ్రీనివాసరావు, కోశాధికారి బొల్లం శివ, రాష్ట్ర మేనేజ్‌మెంట్ కమిటీ సభ్యుడు నడెం శాంతికుమార్, మేనేజింగ్ కమిటీ సభ్యులు మండల పరశురాములు, తోట సంపత్ కుమార్, మామిడాల రమేష్ బాబు, డాక్టర్ రాజ్‌కుమార్, తిరుపతిరెడ్డి, ముల్క ప్రసాద్, కళాశాల డైరెక్టర్లు సీహెచ్ వాణి, విశ్వాంబర్ రెడ్డి, అధ్యాపకులు ఎండీ అజం, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.