హన్మకొండ అక్టోబర్ 03 పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక మాజీ కార్పొరేటర్ కానుగంటి శేఖర్ మృతి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు.ప్రమాదవశాత్తు మెట్లపై నుంచి జారిపడటంతో తీవ్రంగా గాయపడిన శేఖర్‌ను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి చేరుకుని శేఖర్ పార్థివ దేహానికి నివాళులర్పించారు.అనంతరం తీవ్ర విషాదంలో ఉన్న శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కష్ట సమయంలో కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు.శేఖర్ మృతి పట్ల ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.