–మద్యంలో మత్తు పదార్థం కలిపి మహిళపై చోరీ… –బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ అపహరణ.. ముగ్గురు నిందితుల అరెస్ట్..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08..వరంగల్: మాయమాటలతో మహిళను నమ్మించి, మద్యంలో మత్తు పదార్థం కలిపి తాగించి అపస్మారక స్థితికి చేర్చి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను మట్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.1.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ 26న MGM ఆసుపత్రి నర్సింగ్ హాస్టల్ సమీపంలోని చెట్ల ప్రాంతానికి...