Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 08 October 2026, 2:49 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

–మద్యంలో మత్తు పదార్థం కలిపి మహిళపై చోరీ… –బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ అపహరణ.. ముగ్గురు నిందితుల అరెస్ట్..

పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08..వరంగల్: మాయమాటలతో మహిళను నమ్మించి, మద్యంలో మత్తు పదార్థం కలిపి తాగించి అపస్మారక స్థితికి చేర్చి ఆమె వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను చోరీ చేసిన కేసులో ముగ్గురు నిందితులను మట్వాడ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు రూ.1.80 లక్షల విలువైన బంగారు ఆభరణాలతో పాటు ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.పోలీసుల వివరాల ప్రకారం.. 2026 సెప్టెంబర్ 26న MGM ఆసుపత్రి నర్సింగ్ హాస్టల్ సమీపంలోని చెట్ల ప్రాంతానికి బాధితురాలిని నిందితులు మాయమాటలతో రప్పించారు. అనంతరం ఆమెకు మద్యంలో మత్తు పదార్థం కలిపి తాగించడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుంది. ఇదే అదునుగా భావించిన నిందితులు ఆమె వద్ద ఉన్న బంగారు పుస్తెలతాడు, ఉంగరం, చెవిదిద్దులు, ఇతర బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్‌ను అపహరించి అక్కడి నుంచి పరారయ్యారు.బాధితురాలి ఫిర్యాదు మేరకు మట్వాడ పోలీస్ స్టేషన్‌లో Cr.No.537/2026 U/S 123, 318(4), 303(2) r/w 3(5) BNS కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.దర్యాప్తులో భాగంగా సాంకేతిక ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో ములుగు రోడ్ జంక్షన్ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన నిందితుల వివరాలు..1.పెండెల కిషన్ – A1..2.పల్లె సాయి శివ – A2..3.ఆకరపు శివకుమార్ అలియస్ లడ్డు – A3..వీరి దగ్గరనుండి స్వాధీనం చేసుకున్న సొత్తు- 1.975 గ్రాముల బంగారు ఉంగరం. 2.200 గ్రాముల బంగారు చెవిదిద్దులు..26.100 గ్రాముల బంగారు పుస్తెలతాడు..2.420 గ్రాముల రెండు పుస్తెలు…0.680 గ్రాముల రెండు గుండ్లు..ఒక LAVA మొబైల్ ఫోన్..స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాలు, మొబైల్ ఫోన్ విలువ సుమారు రూ.1,80,000గా పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.దీని ద్వారా ప పోలీసుల నుండి ప్రజలకు తెలియజేయు మనవి సూచన…తెలియని వ్యక్తుల మాటలు నమ్మి వారితో ఒంటరిగా వెళ్లడం, వారు అందించే ఆహారం లేదా పానీయాలను స్వీకరించే విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని మట్టేవాడ పోలీసులు కోరారు..