–భూగర్భ జలాలను సంరక్షిస్తూ ఆయిల్‌పామ్ సాగు చేయాలి… —ఎల్‌నినో పరిస్థితుల్లో శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలి: కలెక్టర్ డాక్టర్ సత్య శారద..
వరంగల్, పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08 ప్రస్తుత ఎల్‌నినో పరిస్థితుల్లో ఆయిల్‌పామ్ రైతులు భూగర్భ జలాలు, నీటి వనరులను సంరక్షించుకుంటూ బిందు సేద్యం ద్వారా శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. తక్కువ నీటితో అధిక లాభాలు పొందే పంటల వైపు రైతులు దృష్టి సారించాలని, జిల్లాలో ఎగుమతులకు అవకాశమున్న పంటలను ప్రోత్సహించాలని అన్నారు.గీసుకొండ మండలం కొనేమాకులలోని పీడీఆర్ గార్డెన్స్‌లో గురువారం వరంగల్ జిల్లా ఆయిల్‌పామ్ రైతుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన...