-భద్రకాళి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబరు 16 శ్రీ భద్రకాళి దేవస్థాన నూతన పాలక మండలి సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ,వారి సతీమణి నాయిని నీలిమా రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, అర్చకులు ఎమ్మెల్యే దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని, వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు.తదనంతరం ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయ EO సునీత ...