—భద్రకాళి అమ్మవారి రథాన్ని ప్రారంభించిన మంత్రి,  దుద్దిళ్ల ఎమ్మెల్యే నాయిని..పద్మాక్షి, భద్రకాళి, వేయిస్తంభాల ఆలయాల్లో ప్రత్యేక పూజలు…

హనుమకొండ, పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక. ఆక్టోబర్ 17 వరంగల్, హనుమకొండ నగరాలకు ఐటీ టవర్ల ఏర్పాటు కోసం అవసరమైన ప్రతిపాదనలను పరిశీలించి, రానున్న రోజుల్లో ముందుకు తీసుకెళ్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరంలో పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. భద్రకాళి అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని ఈ సందర్భంగా మంత్రి అభినందించారు.నాయిని విశాల్...