Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 17 October 2026, 4:39 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి శ్రీధర్ బాబు, డిసిసి అధ్యక్షులు వెంకట్రామ్ రెడ్డి  ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి…

వరంగల్ పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక అక్టోబర్ 17

శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారిని శనివారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు  దర్శించుకొన్నారు. వారి వెంట హనుమకొండ డిసిసి అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి దంపతులు కూడా పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న వారికి అర్చకులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయ సాంప్రదాయం ప్రకారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ విశేషాలను, ఏర్పాట్లను వారు అడిగి తెలుసుకున్నారు. దర్శనానంతరం అర్చకులు వారికి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం పలికారు.