-బుద్ధరఘు కుటుంబానికి కూరగాయల మార్కెట్ వ్యాపారుల చేయూత…–మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత…
పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక వరంగల్, అక్టోబర్ 27 వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వ్యాపారి బుద్ధరఘు అకాల మరణం పట్ల వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల పరపతి సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో బుద్ధరఘు కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.ఆపద సమయంలో...