Parivarthana Awaaz
Newspaper Banner
Date of Publish : 27 October 2026, 2:55 pm Posted by : MOHAMMED BASHEERUDDIN..

-బుద్ధరఘు కుటుంబానికి కూరగాయల మార్కెట్ వ్యాపారుల చేయూత…–మృతుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేత…

పరివర్తన అవాజ్ తెలుగు దినపత్రిక  వరంగల్, అక్టోబర్ 27

వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వ్యాపారి బుద్ధరఘు అకాల మరణం పట్ల వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వ్యాపారస్తుల పరపతి సంఘం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది. ఆయన మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ, మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షుడు, ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ వరంగల్ జిల్లా చైర్మన్ బేతి అశోక్ బాబు ఆధ్వర్యంలో బుద్ధరఘు కుటుంబ సభ్యులకు రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు.ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అండగా నిలవడం సామాజిక బాధ్యతగా భావించి ఈ ఆర్థిక సాయం అందించినట్లు సంఘం ప్రతినిధులు తెలిపారు. వ్యాపార వర్గాల్లో ఒకరికి కష్టం వచ్చినప్పుడు మరొకరు తోడుగా నిలవాలనే స్ఫూర్తితో ఈ కార్యక్రమం చేపట్టినట్లు అధ్యక్షుడు బేతి అశోక్ బాబు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంఘం సెక్రటరీ కసర్ల రాజు యుగంధర్‌తో పాటు బూరుగుపల్లి శ్రీనివాస్, పాటల రవి, భద్రయ్య, నేపాల్ రాజు, బబ్బూరి నరేష్, అమర్, వడ్డే నిర్మల్ తదితరులు పాల్గొన్నారు.