–బాలల స్నేహపూర్వక నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కమిషనర్ వెంకన్న.. —నర్చరింగ్ నెయిబర్‌హుడ్స్–2.0’ సిటీ లెవల్ వర్క్‌షాప్ నిర్వహణ…
జిడబ్ల్యుఎంసి పరివర్తన ఆవాజ్ తెలుగు దిన పత్రిక అక్టోబర్ 08..చిన్నారులు, తల్లిదండ్రులు, కుటుంబాలకు సురక్షితమైన, ఆహ్లాదకరమైన, పచ్చదనంతో కూడిన ప్రజా ప్రదేశాలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC), వరల్డ్ రిసోర్సెస్ ఇన్‌స్టిట్యూట్ (WRI ఇండియా) ఆధ్వర్యంలో ‘నర్చరింగ్ నెయిబర్‌హుడ్స్–2.0’ సిటీ లెవల్ వర్క్‌షాప్‌ను గురువారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు.కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న మాట్లాడుతూ.. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకునేలా, తల్లిదండ్రులు ప్రశాంతంగా సమయం గడిపేలా నగరంలోని ప్రజా ప్రదేశాలను అభివృద్ధి చేయాల్సిన...