-బతుకమ్మ స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు …* –అభివృద్ధి పనులపై అధికారులతో చర్చించి పలు సూచనలు..

పరివర్తన అవాజ్ తెలుగు దిన పత్రిక , అక్టోబర్ 6: వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ 56వ డివిజన్ గోపాలపూర్‌లోని ఆర్కాసాయికుంట బతుకమ్మ నిర్వహణ కోసం ఏర్పాటు చేయనున్న స్థలాన్ని వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి  కేఆర్ నాగరాజు  మంగళవారం పరిశీలించారు.స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే  బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు ముందుగానే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. స్థలంలో మౌలిక వసతులు, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు, రహదారి తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం సంబంధిత...